కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ రాయుడుపాలెంకు చెందిన రాజులపూడి ఆరుద్ర దంపతులకు ఒక దివ్యాంగురాలు కుమార్తె. వీరికి అమలాపురంలో కొంత భూమి ఉంది. అన్నవరంలో ఇల్లు ఉంది. ఈ ఇల్లు అమ్మకానికి పెట్టినప్పుడు మంత్రి దాడిశెట్టి రాజా గన్ మెన్ తో పాటు మరో ప్రజాప్రతినిధి అడ్డుకున్నారు. ఆమె స్పందనలో కలెక్టర్ ను కలిశారు. ఫలితం లేదు. గత ఏడాది నేరుగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్దకు వెళ్లి విన్నవించుకునే ప్రయత్నం చేశారు. వారి లోనికి రానివ్వలేదు. దీంతో అక్కడే ఆత్మహత్య యత్నం చేసారు. అది గమనించిన సీఎంవో అధికారులు విజయవాడలోని ఆసుపత్రులో చేర్చారు. ఆమె కోలుకున్న తర్వాత న్యాయం చేస్తామని చెప్పి కాకినాడ పంపేశారు. దాంతో ఆమె కాకినాడలో ఎన్నో ఆందోళనలు చేశారు. ఈనేపద్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. జిల్లా కలెక్టర్ మీడియా కంట పడకుండా ఆమెను తన కార్యాలయానికి పిలిపించుకున్నారు. మొత్తం మీద ఆమె ఇల్లు అమ్మేలా చేశారు. కానీ పోలీసులు కేసు బలంగా పెట్టకపోవడంతో ఆ ఇంటికి సంబంధించి గెన్ మెన్, ఇతరులపై పెట్టిన కేసు, ఆస్తికి సంబంధించి క్వాష్ పిటిషన్ కి వెళ్లారని దీంతో తమకు కోర్టులో వ్యతిరేకంగా వస్తే తిరిగి ఇల్లు గన్ మెన్ సొంతమవుతుందని ఆమె భర్త ఆరోపిస్తున్నారు. ఆమె తరచూ ఆందోళన చేయడంతో ఆమెకు మతి చలించిందని చెప్పి కొంతకాలం విశాఖ మెంటల్ ఆస్పత్రికి తరలించారు. తాజాగా ఆమె తన కూతురును పెట్టుకుని కాశీలో ఆయుర్వేద వైద్యం పొందుతున్నారు. ఆమె భర్త మాత్రం అమలాపురంలో ఉన్నారు. ఇప్పటికీ తమకు న్యాయం జరగలేదన్నారు. ఆమెను మెంటల్ ఆస్పత్రికి పంపడంతో మరో డాక్టర్ సుధాకర్ కధ పునరావృతం అవుతుందా అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. జనసేన నాయకులు కలిశారు. పవన్ కళ్యాణ్ నేరుగా వారాహి యాత్రలో ఆమె పవన్ కళ్యాణ్ ను కలిసారు. అదే విధంగా కాకినాడ వచ్చిన చంద్రబాబును కలిశారు. న్యాయం జరగకపోవడం మెంటల్ ముద్ర వేయడం అందరిని బాధిస్తోంది
ఆరుద్రకు న్యాయం జరిగేనా..?
71
previous post