ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(YS Jagan) కూటమి నేతలపై వ్యాఖ్యలను తీవ్రతరం చేశారు. ముఖ్యంగా చంద్రబాబు(Chandrababu) పై విమర్శలు చేశారు. తిరుపతి జిల్లా(Tirupati District) వెంకటగిరి(Venkatagiri)లో సీఎం జగన్ ఎన్నికల ప్రచార(Election Campaign) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు సాధ్యం కాని హామీలతో మరోసారి మోసం చేస్తున్నారని, బాబును నమ్మడమంటే పులినోట్లో తలకాయ పెట్టినట్లేనని ఆరోపించారు. వైసీపీ అమలు చేసిన పథకాలు కొనసాగాలంటే వైసీపీ తిరిగి అధికారంలోకి రావాలని, చంద్రబాబుకు వేస్తే పథకాలు ముగింపు అవుతాయని పేర్కొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
14 ఏండ్ల పాటు సీఎంగా పనిచేసినా చంద్రబాబు గుర్తుకు వచ్చే పథకాలు ఏమైనా ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. పేదలకు ఏ ఒక్క మంచి పథకాలు లేవని ఆరోపించారు. జన్మభూమి కమిటీల మీద నమ్మకం ఉంటే అధికారంలో వస్తే తిరిగి ధైర్యంగా పునరుద్దరిస్తావా లేదా అంటూ నిలదీశారు. వాలంటీర్ల వ్యవస్థను తిరిగి తీసుకొస్తానని వెల్లడించారు. 2014లోనూ జనసేన, బీజేపీతో కూటమి కట్టి ఎడాపెడా వాగ్దానాలు చేశారని, అధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కి ప్రజల జీవితాలతో చెలగాటమాడారని ఆరోపించారు. రైతుల రుణమాఫీ, పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేయలేదని దుయ్యబట్టారు. ఈ ఎన్నికలు తలరాతలు రాసే ఎన్నికలని, ప్రజలు ఆలోచించి మంచి చేసే పార్టీకి ఓటు వేయాలని కోరారు.
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
- మాజీ MLA వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధం …మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదు కృష్ణాజిల్లా గన్నవరంలోని వీరవల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. గత ప్రభుత్వంలో వైసీపీ నేతల దౌర్జన్య కాండకు టీడీపీ నేత మాదాల శ్రీనివాసరావు నష్టపోయారని ఫిర్యాదులో తెలిపారు. తన…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.