79
మాజీ మంత్రి నారాయణపై నెల్లూరు నగర్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం నియమించిన వలంటీర్లు ఇల్లిళ్లూ తిరిగి సంక్షేమ పథకాలు అందిస్తుంటే వారిపై టీడీపీ విమర్శలు చేయడం దారుణమన్నారు. అలాంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు నెల్లూరు నగరంలో ప్రయివేట్ వ్యక్తులను ఇంటింటికీ ఎలా తిప్పుతున్నారని ప్రశ్నించారు. జనం వివరాలు సేకరించడం దేనికి సంకేతమో చెప్పాలని అనిల్ ప్రశ్నించారు. నగరంలోని 52వ డివిజన్ రంగనాయకులపేటలో ఆయన పర్యటించారు. గడపగడపకు తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. సత్వర పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. జగన్ ప్రభుత్వం సంక్షేమ పాలనను వివరించారు.
Read Also..
Read Also..