టీడీపీ కొత్త కార్యవర్గం ప్రకటన …

Advertisements

<p>టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది&period; కొత్త కార్యవర్గాన్ని ప్రకటించింది&period; పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ను నియమించింది&period; ఇక ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్‌ కొనసాగనున్నారు&period; పొలిటిబ్యూరో&comma; జాతీయ&comma; రాష్ట్ర కమిటీలను కూడా ప్రకటించింది&period; 29 మందితో పొలిట్ బ్యూరో&comma; 31 మందితో జాతీయ కమిటీని కూర్చారు&period; జాతీయ కమిటీలో ముగ్గురు ప్రధాన కార్యదర్శులు&comma; 18 మంది ఉపాధ్యక్షులు&comma;10 మంది అధికార ప్రతినిధులకు అవకాశం కల్పించారు&period; టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా రామ్మోహన్‌ నాయుడు&comma; బైరెడ్డి శబరి&comma; రాజేశ్‌ కిలారులను నియమించింది&period; అన్ని సమీకరణాలు బేరీజు వేసుకుని కమిటీల కూర్పుపై పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కసరత్తు చేశారు&period; సీనియర్లకు గౌరవమిస్తూ&period;&period;కొత్తవారికి అవకాశాలు కల్పిస్తూ&period;&period; సామాజిక కోణంలో నూతన కమిటీల కూర్పు జరిగింది&period; విధేయత&comma; కష్టపడే తత్వం&comma; అనుభవం లెక్కించి అధిష్ఠానం పదవులు ఇచ్చింది&period; నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు రాని వారికి పార్టీ పదవుల ద్వారా న్యాయం కల్పించింది&period;<&sol;p>&NewLine;<p>ఇక నూతన కార్యవర్గంలో చంద్రబాబు సామాజిక సమీకరణాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు&period; మొత్తం 185 మందితో కూడిన రాష్ట్ర కమిటీలో 122 స్థానాలను బడుగు&comma; బలహీన వర్గాలకే కేటాయించి సామాజిక విప్లవానికి తెరలేపారు&period; ఇందులో బీసీలకు 77&comma; ఎస్సీలకు 25&comma; ఎస్టీలకు 7&comma; మైనార్టీలకు 13 స్థానాలు కల్పించారు&period; మొత్తంగా చూస్తే బీసీలకు 40 శాతం&comma; ఎస్సీలకు 25 శాతం చొప్పున ప్రాతినిధ్యం లభించింది&period; 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని&comma; భవిష్యత్తులో రాబోయే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ మరియు 33 శాతం మహిళా రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకుని మహిళలకు పెద్దపీట వేశారు&period; రాష్ట్ర కమిటీలో ఏకంగా 50 మంది మహిళలకు చోటు కల్పించారు&period; పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కిందిస్థాయి కార్యకర్తలకు అత్యున్నత గౌరవం దక్కింది&period; పార్టీ పొలిట్ బ్యూరోలో సామాన్య కార్యకర్తలను నియమించి చంద్రబాబు అందరినీ ఆశ్చర్యపరిచారు&period; ఓ మండల పార్టీ అధ్యక్షురాలిని నేరుగా పొలిట్ బ్యూరోలోకి తీసుకోవడం ద్వారా&comma; పార్టీ కోసం కష్టపడే వారికి ప్రాధాన్యత ఉంటుందని నిరూపించారు&period;<&sol;p>&NewLine;<p>మొత్తంగా పార్టీ యంత్రాంగాన్ని కొత్త పుంతలు తొక్కించేలా ఈ నియామకాలు జరిగాయి&period; రాష్ట్ర కమిటీలో ఏడుగురు ప్రధాన కార్యదర్శులు&comma; 16 మంది ఉపాధ్యక్షులు&comma; 14 మంది అధికార ప్రతినిధులు&comma; 10 మంది జోనల్ కో-ఆర్డినేటర్లను నియమించారు&period; వీటితో పాటు నాలెడ్జ్ కమిటీ&comma; హెచ్ఆర్డీ కమిటీల్లో కూడా నియామకాలు పూర్తి చేశారు&period; సీనియర్ల అనుభవాన్ని&comma; యువత ఉత్సాహాన్ని సమతుల్యం చేస్తూ రూపొందించిన ఈ కమిటీలు రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..