ఆంధ్రప్రదేశ్లో మరోకొన్ని నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త పార్టీలు పురుడుపోసుకుంటున్నాయి. ప్రముఖ సినీ నిర్మాత సత్యారెడ్డి తెలుగు సేన పార్టీ పేరుతో కొత్త పార్టీని స్థాపించి గంటలు గడవకముందే ఏపీలో మరో కొత్త పార్టీ పురుడుపోసుకుంటుంది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీని ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. జై భారత్ పార్టీ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. విజయవాడ ఎగ్జిక్యూటివ్ క్లబ్లో ఈనెల 22న సాయంత్రం 7.30 గంటలకు పార్టీని అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం. గత ఏడాది పార్టీని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలుస్తోంది. ఇకపోతే వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీగా లక్ష్మీనారాయణ పోటీ చేయాలని భావిస్తున్నారు. తొలుత ఆయన మళ్లీ జనసేన పార్టీలో చేరి పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ ఆయన సొంతంగా పార్టీ పెట్టబోతున్నారనే వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది.
ఏపీలో మరో కొత్త పార్టీ – లక్ష్మీనారాయణ
71
previous post