తెలుగుదేశం ఆధ్వర్యంలోచంద్రన్న కానుకల పంపిణీకి రెడీ అవుతున్న ఏపీ ప్రభుత్వం. గతంలోనూ టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది. చంద్రన్న సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, చంద్రన్న రంజాన్ తోఫా వంటి పేర్లతో వీటిని పంపిణీ చేసింది. అయితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపివేసింది. తాజాగా, ఇప్పుడు మళ్లీ వీటిని పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకాలను పునరుద్ధరించేందుకు పౌరసరఫరాలశాఖ కసరత్తు ప్రారంభించింది.
సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ సందర్భంగా పేదలకు పంపిణీ చేసే ఈ కానుకల కోసం ప్రభుత్వం ఏడాదికి 538 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఐదేళ్లకు రూ. 2,690 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడనుంది. ఈ పథకం కింద చంద్రన్న సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక కింద అరకేజీ కందిపప్పు, అరకేజీ శనగపప్పు, అరకిలో బెల్లం, అర లీటరు పామాయిల్, కిలో గోధుమపిండి, 100 గ్రాముల నెయ్యితో కూడిన కిట్లను రేషన్ కార్డుదారులకు అందిస్తారు.అయితే, రంజాన్ తోఫాలో 2 కేజీల పంచదార, 5 కేజీల గోధుమపిండి, కిలో సేమ్యా, 100 గ్రాముల నెయ్యి ఇస్తారు. అలాగే, రెగ్యులర్ కోటా కింద రేషన్‌కార్డుదారులకు ఉచిత బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు, గోధుమపిండి, జొన్నలు, సజ్జలు కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
- ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..ఒకే విద్యార్థినిని నాలుగు సార్లు ఎలుక కరిచింది. సీరియస్ కావడంతో విద్యార్థినిని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఖమ్మం నగరానికి సమీపంలోని రఘునాధపాలెం బీసీ గురుకుల పాఠశాలలో ఈఘటన జరిగింది. కీర్తి అనే విద్యార్థిని పలు మార్లు ఎలుక…
- విష్ణు గొడవ చేయలేదు … మనోజ్ కావాలనే ఇదంతా చేస్తున్నాడుమంచు మనోజ్ ఫిర్యాదులో ఎలాంటి నిజం లేదన్నారు తల్లి మంచు నిర్మల. మంచు మోహన్‌బాబు ఫ్యామిలీ వివాదంపై ఆయన భార్య నిర్మల తొలిసారి స్పందించారు. మంచు మనోజ్ ఇంట్లో విష్ణు గొడవ చేసినట్లు వస్తోన్న వార్తలపై ఆమె స్పష్టతనిచ్చారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి