హైబ్రిడ్‌ విధానంలో అట్టహాసంగా కొనసాగుతున్న టీడీపీ మహానాడు …

హైబ్రిడ్‌ విధానంలో అట్టహాసంగా కొనసాగుతున్న టీడీపీ మహానాడు

Advertisements

<p>టీడీపీ పసుపు పండుగ మహానాడు హైబ్రిడ్‌ విధానంలో అట్టహాసంగా కొనసాగుతుంది&period; మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అధినేత చంద్రబాబు తెలుగుదేశం జెండా ఆవిష్కరించి&comma; ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించారు&period; వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నారా లోకేశ్‌ &comma; పొలిట్‌ బ్యూరో సభ్యులు&comma; జాతీయ&comma; రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించారు&period; 1875 క్లస్టర్ల నుండి వేలాదిమంది కార్యకర్తలు ఈసారి మహానాడును హైబ్రిడ్ విధానం ద్వారా వీక్షించారు&period; ముఖ్య నాయకుల స్పీచ్‌లను హైబ్రిడ్ విధానంలో 175 నియోజకవర్గాల నేతలు&comma; కార్యకర్తలు ఈసారి ఆన్‌లైన్‌లోనే విన్నారు&period; దానికి సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అన్ని ఏర్పాట్లు చేశారు&period;<&sol;p>&NewLine;<p>స్థానిక ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశించారు&period; ఏ ఎన్నికలైనా గెలుపే ప్రధానమని స్పష్టంచేశారు&period; గెలుపే ధ్యేయంగా నేతలు&comma; కార్యకర్తలు పని చేయాలని&comma; ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తూ ముందుకు సాగాలన్నారు&period; ఎవరూ ఇగోలకు వెళ్లొద్దని చంద్రబాబు హితవు పలికారు&period; మిత్ర పక్షాలతో సఖ్యతతోనూ&period;&period; సమన్వయంతో ముందుకు వెళ్దామని దిశానిర్దేశంచేశారు&period; 2024 ఎన్నికల్లో సాధించిన విజయం మళ్లీ రిపీట్ అయ్యేలా అందరం మమేకం అవుదామన్నారు&period; స్పెషల్ రివిజన్‌లో భాగంగా ఓట్ల నమోదు విషయంలో లీడర్లు&comma; కేడర్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు&period;<&sol;p>&NewLine;<p>తెలుగుదేశం బలం బలగం కేడర్ అన్న చంద్రబాబు&period;&period; ఏదైనా పార్టీ ఫస్ట్&comma; కేడరే ముందని తెలిపారు&period; నాయకులను తయారు చేసే విశ్వవిద్యాలయం తెలుగుదేశం పార్టీ అని అన్నారు&period; ఇక్కడ చదువుకున్న&comma; శిక్షణ పొందిన నాయకులే అన్ని చోట్లా రాణిస్తున్నారని గుర్తుచేశారు&period; సోషల్ రీ ఇంజినీరింగ్ చేయటమే పార్టీ విధానమని తెలిపారు&period; అందరికీ అవకాశాలు కల్పించటమే పార్టీ లక్ష్యమని తెలిపారు&period; పార్టీ అధినేతగా&period;&period; పార్టీ కుటుంబసభ్యులైన కార్యకర్తల ఎంపవర్‌మెంట్ కోసం నిరంతరం పనిచేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;<p>తెలుగుదేశం పార్టీలో ఇకపై మహిళలకు 33శాతం సీట్లు కేటాయిస్తామని కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేశ్‌ కీలక ప్రకటన చేశారు&period; పార్లమెంట్‌లో బిల్లు పాసైనా&&num;8230&semi; అవ్వకపోయినా పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33శాతం సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు&period; బిగ్ అనౌన్స్‌మెంట్‌ అని ఉదయం పెట్టిన పోస్టుకు అనుగుణంగా తన ప్రసంగంలో మహిళలకు రిజర్వేషన్ అంశాన్ని నారా లోకేశ్‌ ప్రకటించారు&period; మహానాడు ఆఫ్‌లైన్ అయినా&comma; హైబ్రిడ్ మోడల్ అయినా టీమ్ 11కి బ్యాటింగ్ తప్పదని మంత్రి నారా లోకేశ్ హెచ్చరించారు&period; వైఎస్ వివేకానందారెడ్డి హత్యపై మండిపడ్డారు&period; బాబాయిని గొడ్డలితో చంపింది నిజం కాదా&quest; అని&comma; అందుకే వాళ్లది గొడ్డలి పార్టీ అని లోకేశ్ విమర్శించారు&period; టెన్త్ క్లాస్ పేపర్ కొట్టేసిన చరిత్ర సైకోదని&comma; తనది స్టాన్‌ఫోర్డ్ హిస్టరీ అని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు&period; పార్లమెంటులో బిల్లు పాసైనా&comma; అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ తరపున వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33శాతం సీట్లు కేటాయిస్తామన్నారు&period; ఈ మేరకు మహానాడులో తీర్మానం ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు&period; ఇది తమ సంకల్పమని&comma; తమ బాధ్యత&comma; తమ కమిట్ మెంట్ అని వ్యాఖ్యానించారు&period; టైమ్&comma; డేట్ ఫిక్స్ చేస్తే అభివృద్ధి&comma; సంక్షేమంపై చర్చకు సిద్ధమని మంత్రి లోకేశ్ సవాల్ విసిరారు&period;<&sol;p>&NewLine;<p>టీడీపీ నాయకులు&comma; కార్యకర్తలంతా ఐక్యతను చాటుకునే వేదిక మహానాడు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు&period; మహానాడు ప్రారంభం సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడారు&period;&period; ఇప్పటి వరకూ పార్టీ ప్రయాణం&comma; భవిష్యత్తులో తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇతర అంశాలను ఈ వేదిక ద్వారా చర్చించుకుందామన్నారు&period; హైబ్రిడ్ విధానంలో మహానాడు 2026 ద్వారా లక్షల సంఖ్యలో నేతలు&comma; కార్యకర్తలు అనుసంధానమై ఉన్నారని తెలిపారు&period; దేశంలో వివిధ రాజకీయ పార్టీలు వచ్చి కాలగర్భంలో కలిసి పోయాయని&comma; టీడీపీ ఒక్కటే నిత్యచైతన్యంతో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలందరికీ అవకాశాలు కల్పిస్తుందన్నారు&period; అధికారంలోకి వచ్చిన 23 నెలల్లోనే అన్ని నామినేటెడ్ పదవులూ కార్యకర్తలకు ఇచ్చామని&comma; భవిష్యత్తులోనూ ఇంకా వస్తాయని పేర్కొన్నారు&period; ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేలా ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్‌-2047 రూపొందించారన్నారు&period;<&sol;p>&NewLine;<p>అణచి వేసే ప్రయత్నం చేస్తే తెలుగుదేశం పార్టీలో యోధులు పుట్టుకొస్తారని గొడ్డలిపార్టీకి అర్థమై ఉంటుందని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి వ్యాఖ్యానించారు&period; గొడ్డలి పార్టీకి లోకేశ్‌ తన పాదయాత్రలో ట్రైలర్‌ చూపిస్తే&period;&period; ఆ తర్వాత ఎన్నికల్లో ప్రజలు సినిమా చూపించారన్నారు&period; ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తిప్పికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు&period; పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నివేదికను బైరెడ్డి శబరి సమర్పించారు&period; రాజకీయ ప్రత్యర్థి జిత్తుల మారి నక్క&period;&period; కార్యకర్తల డేగ కన్నుతో నిఘా పెట్టాలి&&num;8230&semi; నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు&period; సంక్షేమంతోపాటు అభివృద్ధిలోనూ టీడీపీ ముందంజలో ఉందని తెలిపారు&period; 20 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా నారా లోకేశ్‌ కృషి చేస్తున్నారన్నారు&period; అండమాన్‌లోనూ టీడీపీ జెండా రెపరెపలాడుతోందని ప్రశంసించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..