ఏపీలో త్వరలో రాయల్ ఎన్‌ఫీల్డ్ పరిశ్రమ ఏర్పాటు..

ఏపీలో త్వరలో రాయల్ ఎన్‌ఫీల్డ్ పరిశ్రమ ఏర్పాటు

Advertisements

<p>మంత్రి నారా లోకేష్ ఏపీకి ఎవరొస్తున్నారో గెస్ చేయండి అంటూ ఓ వీడియోను ట్వీట్ చేశారు మంత్రి లోకేష్‌&period; త్వరలోనే ఏపీలో రాయల్ ఎన్‌ఫీల్డ్ పరిశ్రమను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు&period; SIPB సమావేశంలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సంస్థ పెట్టుబడులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు&period; ఇక సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మంత్రి లోకేష్‌&period;&period;ఏపీకి వస్తున్న పెట్టుబడులపై స్పందిస్తుంటారు&period; ఇందులో భాగంగానే గతేడాది రాష్ట్రానికి వచ్చే ఐటీ కంపెనీలు&comma; పరిశ్రమలకు సంబంధించి వివరాలను ఎక్స్ వేదికగా అందరితో పంచుకున్నారు&period; ముందు సస్పెన్స్ అంటూ హింట్ ఇచ్చి&period;&period;ఆ తర్వాత ఆ కంపెనీ పేరు&comma; ఎంత పెట్టుబడి పెడుతుందో వివరాలతో సహా ట్వీట్ చేసేవారు&period; తాజాగా మరోసారి లోకేష్ ఏపీకి రాబోతున్న మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు గురించి ఓ వీడియోతో ట్వీట్ చేశారు&period; ఏపీకి ఎవరొస్తున్నారో గెస్ చేయండి అంటూ లోకేష్ ట్వీట్ చేశారు&period; రాష్ట్రానికి రాయల్ ఎన్‌ఫీల్డ్ త్వరలోనే రాబోతుందని చెప్పారు&period; రాయల్ ఎన్‌ఫీల్డ్&period;&period; ఏ లెజండరీ రైడ్&period;&period; ఆంధ్రప్రదేశ్‌లో రైడింగ్‌కు సిద్ధమవుతుందని తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>ఇదిలా ఉంటే&period;&period;అమరావతిలో జరిగిన SIPB సమావేశంలో పలు ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం&period; ఆ కంపెనీల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా ఉంది&period; రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సంస్థ 2 వేల 508 కోట్ల పెట్టుబడితో బుల్లెట్‌ మోటార్‌సైకిళ్ల తయారీ పరిశ్రమను తిరుపతిలో ఏర్పాటు చేయనుంది&period; ఇకపై రాయల్ ఎన్‌ఫీల్డ్ మేడిన్ ఆంధ్రప్రదేశ్ కాబోతోంది&period; రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రతిపాదనకు SIPB ఆమోదం తెలిపింది&period; ఈ క్రమంలోనే రాయల్ ఎన్‌‌ఫీల్డ్ పెట్టుబడి గురించి ప్రస్తావిస్తూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..