కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్

Advertisements

<p>మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది&period; 2021లో పంచాయతీ ఎన్నికల సమయంలో నమోదైన కేసులో ప్రాసిక్యూషన్‌కు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది&period; 2021 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో కొడాలి నాని చంద్రబాబుతో పాటుగా అప్పటి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై వ్యాఖ్యలు చేశారు&period; రాష్ట్రం నుంచి చంద్రబాబును వెళ్లగొట్టాలని&period;&period; నిమ్మగడ్డ రమేష్‌‌కు దురుద్దేశాలు ఆపాదిస్తూ కామెంట్స్ చేశారు&period; ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి వ్యాఖ్యలు చేసినందుకు కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని అప్పటి రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ కమిషనర్ కృష్ణా జిల్లా ఎస్పీకి నివేదిక ఇచ్చారు&period; కొడాలి నానిపై 2021 ఫిబ్రవరి 16à°¨ స్థానిక న్యాయస్థానం అనుమతితో గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు&period;<br &sol;>&NewLine;కొడాలి నాని మంత్రి పదవిలో ఉండటంతో ఈ కేసుపై కోర్టులో విచారణ చేయాలంటే ప్రాసిక్యూషన్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది&period; గత ప్రభుత్వం ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వకపోవడంతో పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేసినా ఈ కేసు విచారణను కోర్టు స్వీకరించలేదు&period; అప్పటి నుంచి ఈ కేసు పెండింగ్‌లో ఉండిపోయింది&period; తాజాగా కృష్ణా జిల్లా కలెక్టర్ ఈ కేసుకు సంబంధించి ప్రతిపాదనల్ని పంపారు&period; వీటిని ప్రభుత్వం పరిశీలించి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్ధారించి నానిపై కేసుకు సంబంధించి ప్రాసిక్యూషన్‌కు అనుమతిచ్చింది&period; హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు&period; ప్రాసిక్యూషన్‌కు అనుమతి రావడంతో కోర్టులో విచారణ ప్రారంభంకానుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.