రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష

Advertisements

<p>రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని&comma; ముఖ్యంగా బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు&period; రాజధానిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో&comma; నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు&period; సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది&period; ఈ సమావేశంలో రాజధాని అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి&comma; అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు&period;<br &sol;>&NewLine;సమావేశంలో ప్రధానంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణ పురోగతిపై సమీక్షించారు&period; బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన అనుమతుల ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు&period; బ్యాంక్ స్ట్రీట్‌లో కార్యాలయాల ఏర్పాటుకు 13 బ్యాంకులు ముందుకు రాగా&comma; వాటిలో 11 సంస్థలు తమ భవన నిర్మాణ బాధ్యతలను సీపీడబ్ల్యూడీకి అప్పగించాయని అధికారులు సీఎంకు వివరించారు&period; ఈ నిర్మాణాలను పూర్తి సమన్వయంతో వేగంగా పూర్తి చేసేలా చూడాలని సీఆర్డీఏ అధికారులకు సూచించారు&period;<br &sol;>&NewLine;రాజధానిలో డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి అన్నారు&period; ఫోన్&comma; కేబుల్&comma; ఇంటర్నెట్ వంటి కనెక్టివిటీ సేవల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు&period; ఇందుకోసం ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో డిజిటల్ వసతులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు&period; అమరావతిని కేవలం నిర్మించడమే కాకుండా&comma; నివాస వ్యయాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు&period; పైప్డ్ గ్యాస్ కనెక్షన్లు&comma; ఇండక్షన్ స్టవ్‌à°² వాడకాన్ని ప్రోత్సహించడం&comma; డిస్ట్రిక్ట్ కూలింగ్ వంటి ఆధునిక వ్యవస్థలను అందుబాటులోకి తేవడం ద్వారా ఇది సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు&period;రాజధాని సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు చెప్పారు&period; ప్రకాశం బ్యారేజీకి ఎగువన వైకుంఠపురం వరకు ఏడాది పొడవునా నీరు నిల్వ ఉండేలా చూడటం ద్వారా పర్యాటక అభివృద్ధికి అపార అవకాశాలు ఉంటాయని అన్నారు&period; జల క్రీడలు&comma; స్విమ్మింగ్ వంటి కార్యకలాపాలను ప్రోత్సహించవచ్చని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.

లంచగొండి అధికారుల్లో మార్పు రాకపోవడానికి కారణం ఏంటి.