రాష్ట్రస్థాయిలో షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవం.

రాష్ట్రస్థాయిలో షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవం

Advertisements

<p>రాష్ట్రస్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవంలో నంద్యాల జిల్లా&comma; ఆత్మకూరుకు చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని షేక్ అనీషా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు&period; అమరావతి వేదికగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్న అనీషా&comma; కేవలం అవార్డు తీసుకోవడమే కాకుండా వేదికపై మంత్రి లోకేష్‌తో నేరుగా ముఖాముఖి మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించారు&period; టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను ఈ అవార్డు దక్కించుకున్న అనీషా&&num;8230&semi; ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు స్కూల్ స్థాయి నుంచే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అంటే పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇస్తే వారి భవిష్యత్తు మరింత బాగుంటుందని అత్యంత ప్రతిభావంతంగా మంత్రికి సూచించారు&period; విద్యార్థిని అనీషా చొరవను&comma; ఆమె ఆలోచనా విధానాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు&period; అంతేకాదు&comma; ఆమె ఇచ్చిన సలహాపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ&&num;8230&semi; రాబోయే ఐదేళ్లలో 10&comma; 11&comma; 12 తరగతుల విద్యార్థులు తమ రెగ్యులర్ చదువుతో పాటే సమాంతరంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేలా విద్యాశాఖలో ప్రత్యేక ప్రణాళికలు తీసుకువస్తామని వేదికపైనే హామీ ఇచ్చారు&period; రాష్ట్రస్థాయి వేదికపై ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని ఇంతటి ప్రతిభ చాటడమే కాకుండా&comma; విద్యావ్యవస్థలో మార్పు కోసం మంత్రికి సూచనలు చేయడంపై నంద్యాల జిల్లా వ్యాప్తంగా సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది&period; స్థానిక విద్యాశాఖ అధికారులు&comma; ప్రజలు అనీషా ప్రతిభను అభినందిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.