కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ.

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ

Advertisements

<p>ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలు&comma; ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు&period; రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన వినతులు సమర్పించారు&period; అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు&&num;8230&semi; కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు&period; ఈ సందర్భంగా రాష్ట్రంలోని ఆక్వా&comma; పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని పరిష్కరించాలని&comma; రాయలసీమ సమగ్రాభివృద్ధికి ఉద్దేశించిన హార్టికల్చర్ హబ్‌కు సహకరించాలని సీఎం కోరారు&period;<&sol;p>&NewLine;<p>ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని&comma; తక్షణం కేంద్రం విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు&period; రొయ్యల మేత తయారీకి ఉపయోగించే ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయం 20 శాతానికి పైగా పెరిగిందని వివరించారు&period; ఫిష్ మీల్ టన్ను రూ&period;1&period;55 లక్షల నుంచి రూ&period;2&period;40 లక్షలకు&comma; చేప నూనె టన్ను రూ&period;2&period;80 లక్షల నుంచి రూ&period;4&period;40 లక్షలకు పెరిగిందని గణాంకాలతో సహా వివరించారు&period; ఈ భారం టన్నుకు రూ&period;25 వేల వరకు పెరిగిందన్నారు&period;<&sol;p>&NewLine;<p>అదే సమయంలో&comma; భారత్ నుంచి ఎగుమతి అయ్యే రొయ్యలపై అమెరికా 5&period;77 శాతం కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ విధించిందని&comma; యాంటీ డంపింగ్ డ్యూటీ వేసే ఆలోచనలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు&period; దేశ రొయ్యల ఎగుమతుల్లో 80 శాతం ఏపీ నుంచే జరుగుతున్నాయని&comma; ఈ సుంకాల వల్ల రాష్ట్రంలోని 30 లక్షల మంది జీవనోపాధి దెబ్బతింటుందని తెలిపారు&period; ఈ విషయంలో కేంద్రం అమెరికాతో సంప్రదింపులు జరపాలని&comma; రూ&period;100 కోట్ల కార్పస్ ఫండ్‌తో &&num;8216&semi;ఆంధ్రప్రదేశ్ ప్రాన్ ప్రొడ్యూసర్స్ కోఆర్డినేషన్ కమిటీ&&num;8217&semi; ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు&period;<&sol;p>&NewLine;<p>జీఎస్టీలో పొగాకు ఉత్పత్తులను అత్యధిక పన్ను శ్లాబులో చేర్చడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు&period; దీని కారణంగా తయారీదారులు కొనుగోళ్లు తగ్గించడంతో వేలం ప్రక్రియ నెమ్మదించిందన్నారు&period; ఈ ఏడాది 230 మిలియన్ కేజీల ఉత్పత్తికి గాను కేవలం 34 మిలియన్ కేజీలు మాత్రమే కొనుగోలు చేశారని&comma; ఇది రైతులు&comma; కార్మికులు&comma; రవాణా రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని వివరించారు&period; ఈ సమస్యను పరిష్కరించి పొగాకు రైతులను ఆదుకోవాలని కోరారు&period;<&sol;p>&NewLine;<p>రాయలసీమను దేశంలోనే అగ్రగామి ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన &&num;8216&semi;రాయలసీమ ఇంటిగ్రేటెడ్ హార్టీకల్చర్ డెవలప్‌మెంట్ ప్లాన్&&num;8217&semi;కు పూర్తి సహకారం అందించాలని చంద్రబాబు కోరారు&period; ఈ ప్రణాళిక ద్వారా రూ&period;40 వేల కోట్ల ప్రభుత్వ&comma; రూ&period;60 వేల కోట్ల ప్రైవేటు పెట్టుబడులతో ఏటా రూ&period;81 వేల కోట్ల స్థూల విలువ జోడింపు &lpar;GVA&rpar;&comma; 19&period;7 లక్షల ఉద్యోగాలు సృష్టించవచ్చని వివరించారు&period; ఆగస్టు 6-7 తేదీల్లో ఈ ప్రాజెక్టు పనుల ప్రారంభోత్సవానికి హాజరు కావాలని నిర్మలా సీతారామన్‌ను ఆహ్వానించారు&period;<&sol;p>&NewLine;<p>ఈ హార్టికల్చర్ హబ్ ప్రణాళికలో భాగంగా&comma; రిలయన్స్ సంస్థ భాగస్వామ్యంతో &&num;8216&semi;ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్&&num;8217&semi; ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు&period; వ్యవసాయంలో ఏఐ&comma; డిజిటల్ టెక్నాలజీ&comma; వాతావరణ సుస్థిరత వంటి అంశాలపై పరిశోధనలు ప్రోత్సహించేలా ఇది గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా పనిచేస్తుందన్నారు&period; ఈ ప్రతిష్ఠాత్మక సంస్థ ఏర్పాటుకు కేంద్రం తోడ్పాటు అందించాలని కోరారు&period; రాష్ట్ర తక్షణ అవసరాలతో పాటు&comma; దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలకు కేంద్ర సహకారం కోరడమే లక్ష్యంగా ఈ భేటీ సాగింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.