తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఆవరణలో చిరుత సంచారం..

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఆవరణలో చిరుత సంచారం

Advertisements

<p>తిరుపతి వేంకటేశ్వర వెటర్నీరీ యూనివర్సిటీ ఆవరణలో చిరుత సంచారం తీవ్ర కలకలం రేపింది&period; వర్సిటీలోని క్లినికల్‌ సైన్సెస్‌ బ్లాక్‌లో సిబ్బంది కంటపడింది చిరుత&period; డిపార్ట్‌మెంట్‌ తలుపులు తీయగానే చిరుతను చూసిన మహిళా అటెండర్‌ భయంతో తలుపులు మూసి పరుగులు పెట్టింది&period; యూనివర్సిటీ పరిసరాల్లో చిరుత తిరుగుతుండటంతో సిబ్బంది&comma; స్థానికులు&period;&period;అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు&period; దీంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు చిరుతను పట్టుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేశారు&period; ఎట్టకేలకు మూడు గంటలపాటు శ్రమించి చిరుతను బంధించింది హనుమాన్‌ టీమ్‌&period; దీంతో యూనివర్సిటీ విద్యార్థులు&comma; సిబ్బందితో పాటు చుట్టుపక్కల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు&period; పట్టుబడిన చిరుతను అధికారులు వెంటనే ఎస్వీ జూపార్క్‌కు తరలించారు&period; ప్రస్తుతం జూపార్క్‌లో అటవీశాఖ సంరక్షణలో ఉన్న చిరుతకు వైద్యులు అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు&period; గత కొద్ది రోజులుగా వర్సిటీ ప్రాంతంలో చిరుతల సంచారం భయాందోళనకు గురిచేస్తుండగా ఇప్పుడు ఏకంగా భవనాల్లోకి చొరబడుతుండడం వర్సిటీ విద్యార్థులు&comma; సిబ్బందిలో మరింత భయం కలిగిస్తుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..