డీఎస్సీపై ఏపీ శాసనమండలిలో టీడీపీ–వైసీపీ మాటల యుద్ధం.

Advertisements

<p>ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి&period; 20 వరకు నాలుగు రోజుల పాటు సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది&period; ప్రజా సమస్యలు&comma; ప్రభుత్వ పథకాల అమలు&comma; రాష్ట్ర ఆర్థిక పరిస్థితి&comma; పాలనకు సంబంధించిన అంశాలపై చర్చకు అవకాశం ఉంది&period; కాగా&period;<br &sol;>&NewLine;తొలిరోజు నుంచే సభలో అధికార&comma; ప్రతిపక్షాల మధ్య రాజకీయ వేడి కనిపించింది&period; మెగా డీఎస్సీ&comma; గత ప్రభుత్వ హయాంలో జరిగిన అంశాలు&comma; అభివృద్ధి కార్యక్రమాలు వంటి అంశాలపై అధికారపక్షం ప్రతిపక్షాన్ని నిలదీస్తుండగా&period;&period; ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని వైసీపీ చెబుతోంది&period; ముఖ్యంగా మెగా డీఎస్సీపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సభలో చర్చకు కేంద్రబిందువుగా మారాయి&period; ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని అధికారపక్షం చెబుతుండగా&period;&period; ఆరోపణలపై సమాధానం చెప్పాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది&period;<br &sol;>&NewLine;మొత్తంగా నాలుగు రోజుల సమావేశాలు వాడీవేడిగా సాగే అవకాశం కనిపిస్తోంది&period; కీలక బిల్లులు&comma; ప్రజా సమస్యలు&comma; ప్రభుత్వ నిర్ణయాలపై చర్చతో పాటు అధికార&comma; విపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే పరిస్థితి కనిపిస్తోంది&period; సభా వ్యవహారాలను బీఏసీ నిర్ణయాల మేరకు ముందుకు తీసుకెళ్లనున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఏపీ శాసనమండలిలో డీఎస్సీ అంశంపై టీడీపీ&comma; వైసీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది&period; మండలి సమావేశాలు ప్రారంభమైన వెంటనే డీఎస్సీలో అక్రమాలపై చర్చించాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టారు&period; విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు&period; వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించడంతో&period;&period; ఆ పార్టీ ఎమ్మెల్సీలు పోడియం వద్ద నిరసనకు దిగారు&period; డీఎస్సీ నియామకాల్లో అవినీతి&comma; అక్రమాలు జరిగాయని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు&period; దీంతో సభలో కొంతసేపు తీవ్ర గందరగోళం నెలకొంది&period;<&sol;p>&NewLine;<p>వైసీపీ ఆరోపణలపై మంత్రులు అచ్చెన్నాయుడు&comma; నాదెండ్ల మనోహర్ తీవ్రంగా స్పందించారు&period; డీఎస్సీపై మాట్లాడే అర్హత వైసీపీకి లేదని అచ్చెన్నాయుడు మండిపడ్డారు&period; ఐదేళ్లపాటు డీఎస్సీ నిర్వహించకుండా ఇప్పుడు అక్రమాలంటూ ఆరోపణలు చేయడం సరికాదన్నారు&period; టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డీఎస్సీ నిర్వహిస్తే&period;&period; వైసీపీ నేతలు కోర్టులను ఆశ్రయించారని ఆరోపించారు&period; డీఎస్సీ నియామకాలపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని&comma; నాలుగు రోజులపాటు చర్చించినా అభ్యంతరం లేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;<p>డీఎస్సీలో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు&period; మరోవైపు ప్రభుత్వ మంత్రులు ఆరోపణలను తిప్పికొట్టడంతో ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది&period; వైసీపీ సభ్యుల ఆందోళనతో సభా కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది&period; పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో మండలి చైర్మన్ సభను వాయిదా వేశారు&period; దీంతో డీఎస్సీ అంశంపై శాసనమండలిలో రాజకీయ వేడి కొనసాగింది&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.