అత్యంత ప్రతిష్ఠాత్మకం ఏపీలో యోగాంధ్ర-2026.

అత్యంత ప్రతిష్ఠాత్మకం ఏపీలో యోగాంధ్ర-2026

Advertisements

<p>ఏపీలో యోగాంధ్ర-2026ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు&period; జూన్‌ 7 నుంచి 14 రోజులు రాష్ట్రవ్యాప్త కార్యక్రమాలు ప్రణాళిక ప్రకారం చేపట్టాలని సూచించారు&period; అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణపై ఉండవల్లి నివాసంలో మంత్రులు&comma; అధికారులతో సమీక్షించారు&period;యోగాంధ్ర కార్యక్రమాల వివరాలను ప్రజెంటేషన్‌ ద్వారా ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు&period; రాష్ట్రప్రభుత్వ యోగా&comma; నేచురోపతి విభాగం సలహాదారు మంతెన సత్యనారాయణరాజు యోగాంధ్రపై రూపొందించిన పోస్టర్ ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు&period; 90 ఆసనాల వీడియోలు&comma; 21 ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఆసనాల వీడియోలు&comma; రోజువారీ సాధన కోసం యోగాసనాలు&comma; ప్రాణాయామంపై ఏడు వీడియోలు&comma; యోగా సందేహాలు ప్రశ్నలు-సమాధానాలపై చేసిన వీడియోలను పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టనున్నట్లు మంతెన సత్యనారాయణ రాజు తెలిపారు&period; 8142404888 నంబర్‌కు హాయ్‌ అని మెసేజ్‌ పంపినా&comma; ఈ వీడియోలు వస్తాయన్నారు&period; సమీక్షలో మంత్రులు నారాయణ&comma; సత్యకుమార్‌ యాదవ్&comma; ఆనం రామనారాయణ రెడ్డి&comma; కందుల దుర్గేష్&comma; సీఎస్‌ సాయిప్రసాద్&comma; ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి సౌరభ్‌ గౌర్&comma; కమిషనర్‌ వీర పాండియన్&comma; వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;<p>జూన్‌ 21à°¨ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అమరావతి సమీప కృష్ణానదిపై నిర్మించిన బ్రిడ్జిపై 25వేల మందితో నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించారు&period; ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు పాల్గొంటారని అధికారులు తెలిపారు&period; జిల్లా కేంద్రాల్లో వెయ్యిమందితో చేపట్టే కార్యక్రమాల్లో మంత్రులు&comma; జిల్లా ఉన్నతాధికారులు పాల్గొంటారన్నారు&period; రాష్ట్రంలో అందుబాటులో ఉన్న 1&period;50 లక్షల మంది ట్రైనర్లకు అదనంగా మరో లక్షమందికి ట్రైనర్లుగా శిక్షణ ఇస్తారు&period; ఒక జిల్లాకు ఒక థీమ్‌తో 14 రోజులు యోగాంధ్ర నిర్వహిస్తారని తెలిపారు&period; ఇందుకు జిల్లాకు రూ&period;25లక్షల చొప్పున కేటాయించారు&period;<br &sol;>&NewLine;ప్రతి జిల్లాలోని రెండు ప్రముఖ పర్యాటక ప్రాంతాల చొప్పున&period;&period; 56 చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి&period;14 రోజుల పాటు పార్కులు&comma; విద్యాసంస్థలు&comma; ప్రభుత్వ కార్యాలయాలు&comma; స్వర్ణ వార్డు- స్వర్ణ గ్రామ కార్యాలయాల్లో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తారు&period; గ్రామ&comma; మండల&comma; నియోజకవర్గ&comma; జిల్లా నుంచి రాష్ట్రస్థాయి వరకు అవార్డులు అందిస్తారని అధికార వర్గాలు తెలిపాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గుజరాత్ టైటాన్స్‌ ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం.

ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూత.

కమర్షియల్ సిలిండర్ల ధర పెంచిన చమురు సంస్థలు .