84
ఇంచార్జ్ ఎస్పీగా ఆరిఫుల్లా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అధికార పార్టీకి సహకరిస్తూ ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారే కారణంతో ఎన్నికల కమిషన్ ఎస్పీ జాషువాపై మంగళవారం వేటు వేసిన విషయం విదితమే. ఎన్నికల కమిషన్ నుంచి ఉత్తర్వులు వచ్చిన వెంటనే ఏఎస్పీ ఆరి ఫుల్లాకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే అధికారులతో సమావేశమయ్యారు.