మచిలీపట్నం పోర్ట్ మొత్తం విలువ 5 వేల 156 కోట్ల రూపాయలని మాజీ మంత్రి పేర్నీ నాని తెలిపారు. నార్త్ బ్రేక్ వాటర్ 250 మీటర్లు, సౌత్ బ్రేక్ వాటర్ 14 వందల మీటర్లు పూర్తయిందన్నారు. అయితే టాప్ లేయర్ ఇంకా పూర్తికాలేదని చెప్పారు. హైవే నుండి పోర్ట్ వరకు 6.5 కిలోమీటర్లు రోడ్ పనులు మొదలు పెడుతున్నారని తెలిపారు. 1923 ఎకరాల భూసేకరణ జరిగిందని, ఇంకా 250 ఎకరాలు రోడ్డు కోసం సేకరణ జరుగుతోందన్నారు. చిలకలపూడి – పెడన మధ్య రైల్వేలైన్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని, సాయిల్ టెస్ట్ ప్రక్రియ జరుగుతోందన్నారు. బొగ్గు నిల్వ చేయడానికి 70 ఎకరాల విస్తీర్ణంలో భూమిని ఎత్తు చేసి చదును చేశారన్నారు. భూమి మీద నుండి సముద్రం లోపలికి 16 మీటర్ల లోతు చొప్పున డ్రేజ్జింగ్ చేస్తున్నారని తెలిపారు. మచిలీపట్నం నుండి పోర్ట్ వరకు మంచి నీటి పైపు లైన్ వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారని పేర్నీ నాని స్పష్టం చేశారు.
మంచినీటి పైప్ లైన్ వేయడానికి ఏర్పాట్లు – పేర్ని నాని
86
previous post