86
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ బాధ్యతలు మంత్రి విడదల రజినీకి ఇవ్వడంపై ఆర్యవైశ్యులు మండిపడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే మద్దాలి గిరికి న్యాయం చేయాలంటూ ఆర్యవైశ్యులు ఆందోళన చేపట్టారు. వైసిపి అధిష్టానం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా మద్దాలి గిరిని ప్రకటించాలని, లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నిరసన తెలిపారు. సిఎం జగన్మోహన్ రెడ్డి పునరాలోచన చేసి మద్దాల గిరికి న్యాయం చేయాలని ఆర్యవైశ్యులు కోరారు.