అయోధ్య లో పూజిత అక్షింతల మహా శోభ యాత్ర శ్రీ రామ మందిర ప్రారంభోత్సవానికి అక్షింతలు పంపే కార్యక్రమంలో భాగంగా శ్రీరామ జన్మభూమి తీర్ద క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని పాలచెట్టు ఏరియా పంచముఖి ఆంజనేయ దేవాలయం నుండి మార్కెట్ సెంటర్ పురవిధుల్లో విశ్వహిందూ పరిషత్ నాయకులు, ఆత్మీయ హిందూ భాందవులు, భక్తులు పల్లకి సేవ శ్రీ వెంకటేశ్వర దేవాలయం వరకు పల్లకి సేవ భక్తులు మహిళలు నిర్వహించారు. మందమర్రి పట్టణ మున్షిపాలిటీ పురవీధుల గుండా పల్లకి సేవ నిర్వహించి, మహిళలు కోలాటాలు, నృత్యాలతో రామనామ స్మరణతో మారుమ్రోగింది. ప్రతీ గడప గడపకు రాముని చిత్ర పటం, అక్షింతలు చేరే విధంగా కార్యాచరణ రూపొందించామని విశ్వహింద్ పరిషత్ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని హిందూ జాతిని సమాజానికి చాటి చెప్పాలని వారు పిలుపునిచ్చారు. ఈ పల్లకి సేవలో పెద్ద ఎత్తున భక్తులు మహిళలు పాల్గొన్నారు.
అయోధ్య అక్షింతల మహా శోభ యాత్ర..
176
previous post