విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు శ్రీకారం..

Advertisements

<p>విశాఖ జిల్లాలోని తర్లువాడలో ఏర్పాటు కానున్న గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన వేడుక అత్యంత వైభవంగా జరిగింది&period; ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావోద్వేగంతో మాట్లాడటం ప్రత్యేకంగా నిలిచింది&period; తన రాజకీయ జీవితంలో ఎన్నో ప్రాజెక్టులను ప్రారంభించినప్పటికీ&comma; ఈ డేటా సెంటర్ ప్రారంభం తనకు చిరస్థాయిగా గుర్తుండిపోతుందని చెబుతునప్పుడు చంద్రబాబు భావోద్వేగానికి లోనైనట్లు తెలుస్తోంది &period; మూడు దశాబ్దాల క్రితం హైదరాబాద్ లో హైటెక్ సిటీ నిర్మాణానికి శ్రీకారం చుట్టినప్పుడు చాలామంది నమ్మలేదని&comma; కానీ నేడు అదే సైబరాబాద్‌గా మారి సంపదను సృష్టిస్తున్నదని గుర్తు చేయడం విశేషం &period; భవిష్యత్తు ఐటీ రంగానిదేనని తాను అప్పుడే చెప్పానని&comma; ఇప్పుడు ప్రపంచం మొత్తం అదే దిశగా నడుస్తోందని చెప్పఁడం ద్వారా చంద్రబాబు కు ఉన్న దూర దృష్టిని తెలియచేస్తుంది &period; విశాఖలో ఇలాంటి భారీ ప్రాజెక్ట్ రావడం రాష్ట్ర అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని&comma; ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది కొత్త దారులు తీసుకురానుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;<p>విశాఖపట్నం భవిష్యత్తులో మరో గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా ఎదగబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు&period; ప్రస్తుతం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్&comma; క్వాంటమ్ కంప్యూటింగ్ విప్లవాలను రాష్ట్రం అందిపుచ్చుకుంటోందని అన్నారు&period; ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతంగా భావించిన ఉత్తరాంధ్ర ఇప్పుడు ఉపాధి&comma; పరిశ్రమల కేంద్రంగా మారుతోందని పేర్కొన్నారు&period; గత రెండేళ్లలో అనేక పరిశ్రమలు విశాఖకు రావడం ఈ మార్పుకు నిదర్శనమని చెప్పారు&period; భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం&comma; గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు&comma; స్టీల్ ప్లాంట్లు&comma; అలాగే గూగుల్ డేటా సెంటర్ తో విశాఖ ప్రాంతం రూపురేఖలు మార్చబోతున్నాయని తెలుస్తుంది &period; విశాఖ ప్రజల ఆతిథ్యం&comma; సహజ సౌందర్యం నగరాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయని చంద్రబాబు అన్నారు&period; సుందర్ పిచాయ్ విశాఖ అందాలను చూసి ఆకర్షితుడై&comma; ఇక్కడ పెట్టుబడులు పెట్టడం గర్వకారణమని పేర్కొనడం విశాఖ అభివృద్ధికి మరో పెద్ద గుర్తింపుగా మారింది&period; విశాఖకు వస్తున్న కంపెనీల ద్వారా స్థానికులకు ఉపాధి &comma; ఉద్యోగ అవకాశాలు మెండుగా లభించనున్నాయి &period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..