కేసీఆర్ మూర్ఖత్వపు పాలన విరగడైంది- బండి సంజయ్

bandi sanjay comments on revanth reddy

Advertisements

&NewLine;<p>తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి&comma; పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి&comma; ఎంపీ బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు&period; ఫలితాల అనంతరం కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన&period; ప్రజల పక్షాన బీజేపీ పోరాడితే కాంగ్రెస్ లబ్ధి పొందిందని సంచలన వ్యాఖ్యలు చేశారు&period; తనను ఓడించాలన్న లక్ష్యంతో ముస్లింల ఇళ్లను కూల్చినోళ్లకు&comma; వక్ఫ్ ఆస్తులను కబ్జా చేసినోళ్లకే ముస్లింలు ఓటు వేయడం తనను ఆశ్చర్యపరిచిందన్నారు&period;<br>ఏది ఏమైనా కేసీఆర్ మూర్ఖత్వపు పాలన విరగడైనందుకు సంతోషంగా ఉందన్నారు&period; బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల గోసపడుతున్న ప్రజలను చైతన్యం చేసింది బీజేపీ అని&comma; కానీ అంతిమంగా కాంగ్రెస్ ఆ లబ్ధి పొందిందని ఆవేదన వ్యక్తం చేశారు&period; ప్రజల పక్షాన నిలిచిన తమపై కేసులు పెట్టారని&comma; జైలుకు కూడా పంపారని గుర్తు చేసుకున్నారు&period; దురదృష్టవశాత్తు ప్రజలు తమను ఆదరించలేదని&comma; అయినప్పటికీ కేసీఆర్ మూర్ఖత్వపు పాలన విరగడైనందుకు సంతోషంగా ఉందన్నారు&period;<br>గెలుపోటముల ఆధారంగా తాను పనిచేయనని&comma; తన లక్ష్యం తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమేనని స్పష్టం చేశారు&period; కేసీఆర్‌కు తాను&comma; రేవంత్‌రెడ్డి లక్ష్యంగా మారామన్నారు&period; బీజేపీ కోసం కష్టపడి పనిచేసిన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు&period; ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రూ&period; 200 కోట్లు ఖర్చు చేసి తిరిగి తాను డబ్బులు పంచుతున్నానని అభాండాలు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు&period; బీజేపీ గ్రాఫ్ తగ్గించేందుకు కుట్ర చేసి&comma; ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చి లాభపడాలని చూసిన బీఆర్ఎస్ చివరికి ఓటమి మూటగట్టుకుందని బండి సంజయ్ పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా..

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..