ఆత్మహత్య చేసుకున్న నేతన్న సిరిపురం లక్ష్మినారాయణ భౌతిక దేహానికి బండి సంజయ్ నివాళులర్పించి, లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో పని లేక లక్ష్మినారాయణ ఆత్మహత్య చేసుకున్నాడని, కాంగ్రెస్, బిఆర్ఎస్ లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తప్పితే, నేతన్నలను ఆదుకోవాలని ఎవరకి లేదని మండిపడ్డారు. నేతన్నలు పని కల్పించాలని రొడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. ఆత్మహత్యలను ఆపడానికి ప్రభుత్వం వెంటనే స్పందించి, పాత బకాయిలు విడుదల చేసి, కొత్తగా బతుకమ్మా చీరల ఆర్డర్ లు ఇవ్వాలిని డిమాండ్ చేశారు. వర్కర్ టు ఓనర్ పథకం అన్నారు, అది ఏక్కడికి పోయిందో ఎవరికి తెలియదని విమర్శించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంకు పరిష్కారం చూపించడానికి అందరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మృతిని కుటుంబానికి ప్రభుత్వం స్పందించి ఆర్ధికసాయం చేయాలని సూచించారు.
లక్ష్మినారాయణ భౌతిక దేహానికి నివాళులర్పించిన బండి సంజయ్…
71
previous post