64
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంటింటికీ తిరిగి బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని కరీంనగర్ బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారనీ, ఓటర్ లిస్టు పట్టుకుని ఒక్కొక్కరికి రూ.10 వేలు ఇస్తూ ఆ లిస్ట్ పై పెయిడ్ అని రాసుకుంటున్నా పోలీసులు పట్టించుకోవడంలేదన్నారు. పోలీస్ కమిషనర్ పూర్తి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నప్పటికీ… కిందిస్థాయి సిబ్బంది మాత్రం బీఆర్ఎస్ తొత్తులుగా మారారు అని అన్నారు.బీజేపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.