69
మందస మండలం రట్టిలో ఎలుగు బంటి సంచారంతో గ్రామస్తులు భయాందోళన చెందారు. రట్టి గ్రామానికి సమీపంలోని తోటలో అలజడి చేసిన ఎలుగుబంటిని చూసిన గ్రామస్తులు భయబ్రాంతులకు గురయ్యారు. రట్టిలో ఆహార అన్వేషణ కోసం ఎలుగుబంటి పుట్టను త్రవ్వి హల్ చల్ చేసింది. అటు ఇటు తిరుగుతూ కాసేపు చక్కర్లు కొట్టిన ఎలుగుబంటి నెమ్మదిగా జారుకుని సమీపంలోని జీడి తోటల్లోకి పారిపోయింది. రట్టి సమీపంలోని కొండల నుంచి ఎలుగు బంట్లు గ్రామాల్లోకి చొరబడి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అటవీశాఖ అధికారులు స్పందించి భల్లూకాలు జనవాసాల్లోకి రాకుండా శాశ్వత చర్యలు తీసుకొని ఎలుగుబంట్ల బారి నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.