తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా అధికారిక నివాసం ‘మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్’లోకి అడుగుపెట్టారు. ఇందుకు సంబంధించి గురువారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే ఉన్న మైసమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఆ తర్వాత తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టేందుకు సచివాలయానికి వెళ్లారు. కాగా పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను భట్టి విక్రమార్క సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. పూజా కార్యక్రమాల్లో భట్టి భార్య, ఇతర కుటుంబ సభ్యులు, ఆయన అనుచరులు, కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం అధికారిక నివాసంగా ప్రజాభవన్ ఉండేది. అయితే సీఎం నివాసాన్ని వేరే ప్రాంతానికి మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది. అందుకే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రజాభవన్‌ను కేటాయించింది. అందుకే గురువారం తెల్లవారుజామున ఆయన కుటుంబ సమేతంగా అడుగుపెట్టారు.
ప్రజాభవన్ లోకి కుటుంబ సమేతంగా అడుగుపెట్టిన భట్టి విక్రమార్క
98
previous post