78
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఇచ్చిన ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ఈ మేరకు మధిర నియోజకవర్గంలోని చొప్పకట్లపాలెం దేవాలయంలో రూ.100 స్టాంప్ పేపర్‌పై సంతకం చేశారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను నేను కచ్చితంగా నెరవేరుస్తా అన్నారు. మన నియోజకవర్గ అభివృద్ధికి పూర్తిగా అంకితమవుతానని భట్టి తెలిపారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పని చేస్తూ.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడతాను అని భట్టి విక్రమార్క అఫిడవిట్లో పేర్కొన్నారు.