తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఎన్నికల హామీలైన ఆరు గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలో ప్రారంభించనున్నారు. స్వంత స్థలం ఉన్న వారి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, ఇల్లు లేని పేదలకు స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా ఒక్కో నియోజకవర్గానికి 3 వేల 500 ఇళ్లను మంజూరు చేయాలని సూచన ప్రాయంగా సర్కార్ నిర్ణయం తీసుకుంది. గూడు లేని నిరుపేదల సొంత ఇంటి కలను దశలా వారీగా నెరవేర్చడం తమ ప్రభుత్వ సంకల్పమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో చేసిన తప్పులు జరగకుండా అర్హులైన వారికే లబ్ధి చేకూరుస్తామని తెలిపింది . లబ్ధిదారులకు అందాల్సిన నిధులు దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన మార్గదర్శకాలు రూపొందించనున్నట్లు స్పష్టం చేసింది. సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి ఉపయోగపడేలా వివిధ రకాల ఇంటి నమూనాలు, డిజైన్లను ప్రభుత్వం ఇప్పటికే తయారు చేయించింది. ఈ ఇళ్ల నిర్మాణాల్లో తప్పనిసరిగా ఒక వంటగది, టాయిలెట్ ఉండేలా కొత్త ఇంటి నిర్మాణాల నమూనాలు రిలీజ్ చేసింది.
Six guarantees
తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే ఆరు గ్యారంటీలను ప్రకటించామని అసెంబ్లీలో మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. బడ్జెట్ ప్రసంగంలో గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దుర్భరంగా మార్చేశారని మండిపడ్డారు. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన నష్టాలకు సంబంధించి తమ ప్రభుత్వం మొదట్లోనే శ్వేతపత్రం విడుదల చేసి వాస్తవాలను ప్రజల ముందు పెట్టిందని భట్టి గుర్తుచేశారు. అయితే, ప్రజా సంక్షేమం కోసం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి ఇవేవీ తమకు అడ్డుకాదని, ఎంత కష్టపడడానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీలను అమలు చేసి తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని తెలిపారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవదూరంగా ఉందని బీఆర్ఎస్ పై భట్టి విక్రమార్క మండిపడ్డారు. దళిత బంధు పథకానికి బడ్జెట్ లో 17 వేల 700 కోట్లు కేటాయించిన గత ప్రభుత్వం.. వాస్తవంలో ఒక్క పైసా కూడా విడుదల చేయలేదని భట్టి ఆరోపించారు.
తెలంగాణ:
ఆరు గ్యారంటీల అమలలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రెండింటికి శ్రీకారం చుట్టింది. ఇక మరో రెండు హామిలు అమలుకు సన్నద్ధమవుతోంది. ఉచిత విద్యుత్తు కింద 200 యూనిట్లు గృహావసరాలకు, రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేయాలని రాఫ్ర్ట మంత్రిమండలి నిర్ణయించింది. అయితే ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని, 10న బడ్జెట్ ప్రవేశపెట్టాలని మంత్రిమండలి తీర్మనించింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో రూ.10 లక్షలకు పెంపు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇప్పటికే అమలవుతున్న సంగతి తెలిసిందే. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మూడు గంటలకు పైగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం సచివాలయంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రివర్గం ఆమోదించిన అంశాలను విలేకరులకు వెల్లడించారు. Read Also..
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అడ్డగోలుగా అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ఎందుకు సీబీఐ విచారణ కోరడం లేదని ప్రశ్నించారు డీకే అరుణ. హైకోర్టు న్యాయ విచారణ అనేది కాలయాపన కోసమేనన్న డీకే అరుణ. కాళేశ్వరం పై సీబీఐ విచారణ జరపాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. విచారణ పై కాంగ్రెస్ చొరవ తీసుకోవాలని, కమీషన్ల కోసం ప్రాజెక్ట్‌ను నాణ్యతాలోపంతో డిజైన్ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేయాలన్న డీకే అరుణ. ఆరు గ్యారెంటీలతో పాటు మిగతా హామీలు కూడా నిలబెట్టుకోవాలని సూచించారు.
ప్రజాపాలన, అభయహస్తం, ఆరు గ్యారంటీల పథకాలను ప్రజలు ఉపయోగించుకోవాలని ఎంపీపీ బోజ్యానాయక్ తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ముక్కిదిగుండం, నార్ల పూరు గ్రామాల్లో ప్రజా పరిపాలన అభయహస్తం ఆరు గ్యారంటీల పథకాల దరఖాస్తుల స్వీకరణ ఎంపీపీ భోజ్యనాయక్, చర్పంచ్ చిట్టెమ్మ, మాజీ సర్పచులు శారద లోకేశ్, రామన్ గౌడ్, ఎంపీడీఓ చెన్నమ్మ ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరు గ్యారెంటీల పథకాలను ప్రజలకు వివరించారు. దరఖాస్తులను ప్రజలకు అందజేసి దరఖాస్తులు నింపే విధానాన్ని పంచాయతీ సెక్రెటరీ గోపాల్ వివరించారు. గ్రామపంచాయతీ దగ్గర ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆరు గ్యారెంటీల పథకాలకు కౌంటర్లు ఏర్పాటు చేసి, మంచినీటి సౌకర్యాన్ని సర్పంచ్, ఎంపీపీ బోజ్యా నాయక్ ఏర్పాటు చేశారు. గ్రామస్తులకు ఇబ్బంది కలగకుండా దరఖాస్తులను దగ్గరుండి నింపి, తప్పులు దొర్లకుండా ఆయన అధికారులు పరివేక్షించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరు 6 గ్యారంటీ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.
ప్రజా పాలన దరఖాస్తులు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు కలిసి బుధవారం మధ్యాహ్నం సచివాలయంలో ప్రజా పాలన దరఖాస్తులను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన లోగోను ఆవిష్కరించారు. ఇవి రేపటి నుంచి అందుబాటులో ఉంటాయి. ఆరు పథకాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తుల విడుదల కార్యక్రమం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. నిస్సహాయులకు సాయం అందించడమే తమ లక్ష్యమని, ప్రజలను ప్రభుత్వం వద్దకు రప్పించడం కాదని ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని తీసుకువెళ్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో తాము ఆరు గ్యారెంటీల హామీ ఇచ్చామని, డిసెంబర్ 7వ తేదీన తమ ప్రభుత్వంఏర్పాటయింది. జనవరి 7వ తేదీ లోపు సమస్యల పరిష్కారం దిశగా అడుగు వేస్తున్నామన్నారు. రేపటి నుంచి గ్రామ, వార్డు సభలు ఉంటాయన్నారు. ఈ సభల ద్వారా ఆరు గ్యారెంటీల లబ్ధిదారుల ఎంపిక చేస్తామని వెల్లడించారు. ఆరు గ్యారెంటీలను అర్హులైన వారికి ఇస్తామన్నారు.
ఖమ్మం జిల్లా కూసుమంచి ప్రభుత్వ ఆసుపత్రిలో ఐదు లక్షల నుంచి 10 లక్షలకు పెంచిన రాజీవ్ ఆరోగ్యశ్రీ ని డెప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు లు ప్రారంభించారు. ఈ సందర్భంగా రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మాటల వరకే పరిమితం కాకుండా మొదటి రెండు రోజుల్లో నే ఆరు గ్యారెంటీ ల్లో రెండు గ్యారెంటీ లను అమలు చేసిందన్నారు. రాబోయే రోజుల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీ లను అమలు చేసే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టభోతోందని శ్రీనివాస రెడ్డి తెలిపారు.
Read Also..
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఈ రోజు రెండు గ్యారంటీలను లాంఛనంగా ప్రారంభించింది. మహిళలకు ఈ రోజు నుంచి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఒక్కటొక్కటిగా వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచే పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆర్టీసీ బస్సులో మంత్రులతో కలిసి రేవంత్ రెడ్డి ప్రయాణించారు. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే పథకం ప్రారంభం అంటూ కాంగ్రెస్ ఫర్ తెలంగాణ అనే ట్విట్టర్ హ్యాండిల్ ట్వీట్ చేసింది. రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు బస్సులో ప్రయాణించే సమయంలో ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు కదిలారు. భారీ కాన్వాయ్‌తో బస్సులు ముందుకు కదిలాయి. తెలంగాణ తల్లి అంటే సోనియా గాంధీ రూపం కనిపిస్తుందని, నాది తెలంగాణ అని చెప్పుకునే అవకాశాన్ని మనకు సోనియా గాంధీ ఇచ్చారన్నారు సోనియా గాంధీ. ప్రజల కోసమే సోనియాగాంధీ ఆరు గ్యారెంటీలు ఇచ్చారని, ఇందులో భాగంగా ఈ రోజు రెండు గ్యారంటీలను అమలు చేస్తున్నామన్నారు. మహిళలకు ఈ రోజు నుంచి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఒక్కటొక్కటిగా వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఇచ్చిన ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ఈ మేరకు మధిర నియోజకవర్గంలోని చొప్పకట్లపాలెం దేవాలయంలో రూ.100 స్టాంప్ పేపర్‌పై సంతకం చేశారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను నేను కచ్చితంగా నెరవేరుస్తా అన్నారు. మన నియోజకవర్గ అభివృద్ధికి పూర్తిగా అంకితమవుతానని భట్టి తెలిపారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పని చేస్తూ.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడతాను అని భట్టి విక్రమార్క అఫిడవిట్లో పేర్కొన్నారు.





Total views : 146880