ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో అరెస్ట్ అయిన అడిషనల్ ఎస్పీలు భుజంగరావు(Bhujangarao), తిరుపతన్న(Tirupattana)కు కోర్టు రిమాండ్ విధించింది. వారిద్దరిని కస్టడీ ముగియడంతో పోలీసులు హైదరాబాద్(Hyderabad)లోని నాంపల్లి కోర్టు(Nampally Court)లో హాజరుపరిచారు. వారికి కోర్టు ఏప్రిల్ 6వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇది చదవండి: గాయత్రి పంపు హౌస్ నుండి వరద కాలువకు నీరు విడుదల..
కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే తిరుపతన్న, భుజంగరావు నుంచి కీలక అంశాలను రాబట్టినట్లు తెలుస్తోంది. ప్రణీత్ రావు, రాధా కిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తిరుపతన్న, భుజంగరావును అధికారులు ప్రశ్నిస్తున్నారు. భుజంగరావు, తిరుపతన్న ఇచ్చిన ఆధారాలతో మరికొంతమందిని దర్యాప్తు బృందం విచారించనుంది.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి