ఈ రోజుల్లో ప్రతి ఆర్ధిక అవసరానికి UPI పేమెంట్ మోడ్ ఎంతో ఉపయోగపడుతోంది. ఈ నేపథ్యంలో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి యూపీఐ యాప్స్ వాడుతున్న వారిని అలర్ట్ చేస్తూ బిగ్ అప్ డేట్ ఇచ్చింది కేంద్రం. డిసెంబర్ 31 తర్వాత కొన్ని యూపీఐ ఐడీలు పని చేయవని అంటున్నారు. గత ఏడాది కాలంగా ఎలాంటి లావాదేవీలు చేయని యూపీఐ ఐడీలను ఇనాక్టివ్ ఐడీలుగా పరిగణిస్తూ డిసెంబర్ 31లోపు డీయాక్టివేట్ చేయాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ కొద్ది రోజుల క్రితమే పేమెంట్ అప్లికేషన్స్ కి ఆదేశాలు జారీ చేసింది. జనవరి 1వ తేదీ నుంచి ఏ UPI IDలు ఇనాక్టివ్ గా ఉన్నాయో ఆ యూపీఐ ఐడీలు పని చేయవు. ఇనాక్టివ్ ఐడీలకు సేవలు నిలిపివేయనున్నారు. ఇనాక్టివ్ యూపీఐ ఐడీలతో మోసాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, అలాగే కస్టమర్స్ మొబైల్ నెంబర్స్ మారిన సందర్భాల్లో తప్పుడు ట్రాన్సాక్షన్లు జరగకుండా ఉండడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ తెలిపింది. యూపీఐతో బ్యాంక్ అకౌంట్‌ను ఫోన్ నంబర్ లేదా వర్చువల్ పేమెంట్ అడ్రస్ లింక్ చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్ తో బ్యాంక్ అకౌంట్స్ లింక్ చేసుకున్న వారు UPI నుంచి తరచుగా ట్రాంజాక్షన్లు చేయడం మంచిది. అదేవిధంగా అప్పుడప్పుడు ఫోన్ లో UPIకి సంబందించిన సమాచారం, ట్రాంజక్షన్ వివరాలు చెక్ చేస్తూ ఉండాలి. దీని వల్ల మీ అకౌంట్ యాక్టివ్ గా ఉంటుంది. మోసాలకు ఆస్కారం ఉండదు.
గూగుల్ పే, ఫోన్ పే వినియోగదారులకు.. బిగ్ అప్ డేట్
73
previous post