138
నెల్లూరు జిల్లా(Nellore) లో బర్డ్‌ఫ్లూ కలకలం రేగింది. వేలాది కోళ్లు ఉన్నట్టుండి చనిపోతుండడంతో పశుసంవర్ధకశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మృతి చెందిన కోళ్ల శాంపిళ్లు సేకరించి పరీక్షల కోసం భోపాల్ పంపారు. కోళ్ల మృతికి బర్డ్ ఫ్లూ కారణమని పరీక్షల్లో నిర్ధారించినట్టు తెలుస్తోంది. మరోవైపు, బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్లు చనిపోతున్నాయన్న ప్రచారంతో చికెన్ కొనుగోళ్లు అమాంతం పడిపోయాయి. దీంతో చికెన్ సెంటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. అయితే నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రం బర్డ్ ఫ్లూకు సంబంధించి ఎలాంటి కేసులు నమోదు కాలేదు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.