కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే తెలంగాణ రాష్టాన్ని తీసుకుపోయి ఆంధ్రాలో కలుపుతారని అన్నారు కోరుట్ల బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మపురి అరవింద్. నియోజకవర్గం లోని ఇబ్రహీంపట్నం మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో మంద కృష్ణ మాదిగ తో కలిసి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్బంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ 30 యేండ్ల నుండి కొట్లాడుతున్న వర్గీకరణ పై ఎ ఒక్క ప్రభుత్వం కూడా స్పందించలేదు. నరేంద్ర మోడీ స్పందించి వర్గీకరణ కు కమిషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. తెలంగాణ లో బీసీ ని ముఖ్యమంత్రి చేస్తా అన్న పార్టీ బీజేపీ కాబట్టి అందరు కలిసి బీజేపీ కి ఓట్లు వేయాలన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ లు ప్రజలను మోసం చేశాయన్నారు. అరవింద్ మాట్లాడుతూ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఉన్నారా ఉంటే విజిల్ వేయండి అంటూ అరవింద్ కూడ విజిల్ వేసి ఓటర్లను ఆకట్టుకున్నారు.
కోరుట్లలో బీజేపీ ప్రచార జోరు..
65
previous post