72
సంగారెడ్డి రిటర్నింగ్ కార్యాలయం ముందు బీజేపీ నేత రాజేశ్వర్ రావు దేశ్ పాండే నిరసనకు దిగారు. శుక్రవారం విడుదలైన బీజేపీ అభ్యర్థుల చివరి జాబితాలో సంగారెడ్డి నుంచి రాజేశ్వర్ రావు దేశ్ పాండేకు బీజేపీ అధిష్టానం టికెట్ కేటాయించింది. అయితే టికెట్ ఇచ్చినప్పటికీ బీ ఫామ్ ఇవ్వకపోవడంతో దేశ్ పాండే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డికి ఫోన్ చేసి మరీ వెక్కి వెక్కి ఏడ్చారు. తనకు బీ ఫామ్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బీజేపీ నేత హెచ్చరించారు.