86
ఈ నెల 31వ తేదీ నుంచి ఫిబ్రవరి తొమ్మిదో తేదీ వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ నెల 31న రాష్ట్రపతి ప్రసంగం ఉండనుంది. ఫిబ్రవరి ఒకటో తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో చివరి బడ్జెట్ సమావేశాలు ఇవే. బడ్జెట్ సమావేశాల అనంతరం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.