76
విశాఖలో ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు సిద్ధమయ్యాయియ. ఈ మేరకు 35 శాఖల కార్యాలయాలకు భవనాలు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రులు, ఉన్నతాధికారులు, కార్యదర్శులకు భవనాలు కేటాయించారు. ఆంధ్రా వర్సిటీ, రుషికొండ, చినగదిలి సమీపంలో కొన్ని శాఖలకు భవనాలు కేటాయించారు. పలు శాఖలకు ఎండాడ, హనుమంత్వాక ప్రాంతాల్లో కేటాయించారు. జీఏడీ, ఆర్థిక, గ్రామవార్డు సచివాలయ, ఇంధన మినహా ఇతర శాఖలకు భవనాలు కేటాయించారు. 2.27 లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కార్యాలయాలు, విడిది అవసరాలకు కూడా భవనాలను కేటాయించింది.