శుక్రవారం స్థానిక టిడిపి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేను బాగుంటే చాలు, నా పార్టీ ఎమ్మెల్యేలు దోచుకుంటే చాలని జగన్ రెడ్డి నాలుగు నరేల్లగా అవినీతి అక్రమాలు చేస్తూ ప్రజలకు ఒక్క మంచి పని కూడా చేయలేదని ఆయన పెద్దేవా చేశారు. జాబ్ క్యాలెండర్ ఇస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్ రెడ్డి రాష్ట్రంలో యువత జీవితాన్ని నాశనం చేశారని విమర్శించారు. టిడిపి పాలనలో సమాజం బాగుండాలని చంద్రబాబు నాయుడు ఆలోచించి యువతకు పెద్దపీట వేస్తూ 6.50 లక్షల ఉద్యోగాలు కల్పించి ఆదుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనను చూసి ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయని అన్నారు. రాష్ట్రానికి భవిష్యత్తునివ్వటం చేతగాని అసమర్ధ సీఎం జగన్ రెడ్డి గజ దోపిడీ చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
బస్సు యాత్ర – తుస్సు యాత్ర
87
previous post