64
తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎమ్మెల్యే కోటాకు చెందిన ఈ సీట్లకు ఈనెల 29న పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 18 వరకు నామినేషన్లు స్వీకరించిన, 19న పరిశీలన, 22 వరకు ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపింది. 29న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి అదేరోజు ఫలితాలు ప్రకటిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు.
Read Also..
Read Also..