59
పాలు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇది అందరికీ తెలుగు. పాలవలన బరువు తగ్గడము కూడా సాధ్యమే మధ్య వయసులో పాలు తగినంత తాగుతూ , డి-విటమిన్ సమృద్ధిగా తీసుకునేవారు బరువు తగ్గుతారని నిరూపించబదింది. ఇజ్రాయిల్ పరిశోధకులు భారీ కాయము కలిగిన 300 మంది మీద జరిపిన పరిశోధనా ఫలితం ఇది. వీరి వయసు 45-60 మధ్య ఉంది . ప్రతిరోజూ 2 గ్లాసుల పాలు త్రాగడం తో పాటు పిండి పదార్ధము ఉన్న ఆహారము తక్కువగా తీసుకున్న వీరు 2 ఏళ్ళ కాలములో 5.5 కిలోల బరువు తగ్గడము గమనించారు. అదేసమయము లో ఇతర పద్దతుల ద్వారా బరువు తగ్గేందుకు ప్రయత్నించినవారు కేవలము 3 కిలోల బరువు మాత్రమే తగ్గారు. అందుకే పాలలోని కాల్సియం , విటమిన్ డి-బరువుతగ్గడము లో కీలక పాత్ర వహిస్తాయని పరిశోధనల ద్వారా స్పష్టమైనది .