కేసీఆర్ సర్కారుకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్..!

Advertisements

&NewLine;<p>కేసీఆర్ సర్కారుకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది&period; రైతు బంధు పంపిణీకి అడ్డుకట్ట వేసింది&period; దీంతో రైతుల ఖాతాల్లో వేయడానికి సిద్ధమైన సర్కారుకు ఎదురు దెబ్బ తగిలింది&period; తెలంగాణ అన్నదాతలకు రైతు బంధు పంపిణీకి రెండు రోజుల క్రితం సీఈసీ అనుమతి మంజూరు చేసింది&period; ఈ నిర్ణయం సర్కారుకు అనుకూలమన్న విమర్శలు వచ్చాయి&period; కేంద్రం ఒత్తిడితోనే సీఈసీ రైతు బంధుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది&period; తెలంగాణ ఎన్నికల్లో రైతుబంధు చుట్టూ రాజకీయం అల్లుకుంది&period; అన్నదాతల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై పార్టీల మధ్య వాగ్యుద్ధం సాగింది&period; కేసీఆర్ సర్కారు సీజన్ వారీగా రైతులక పెట్టుబడి సాయం అందిస్తోంది&period; తెలంగాణలో మొత్తం 70 లక్షల మంది రైతులు ఉన్నారు&period; వారి ఖాతాల్లోకి 7&comma;700 కోట్ల రూపాయలు జమ చే్స్తోంది&period; తెలంగాణలో ఎక్కువగా ఉన్నది రైతుల ఓట్లే&period; పోలింగ్ కు కొన్ని రోజుల ముందు ఒకటిక కాదు&comma; రెండు కాదు… ఏకంగా 7&comma;700 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి వెళ్లున్నాయనగానే బీఆర్ఎస్ లో ఆనందం&comma; కాంగ్రెస్ లో ఆందోళన వ్యక్తమైంది&period; ఇది కచ్చింతంగా తెలంగాణ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ అవుతుందని కాంగ్రెస్ ఆందోళన చెందింది&period; తెలంగాణలో ఎన్నికల పోరు పతాక స్థాయికి చేరిన ఈ సమయంలో ఈ నిర్ణయం వెలువడింది&period; ప్రధాన పార్టీలు హోరా హోరీగా తల పడుతున్నాయి&period; కాంగ్రెస్ &&num;8211&semi; బీఆర్ఎస్ మధ్య ప్రధానంగా పోటీ కొనసాగుతోంది&period; కాంగ్రెస్ తమదే అధికారం అనే ధీమాతో ఉంది&period; ఈ సమయంలోనే దాదాపు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు జమకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుమతి లభించడంతో ఎన్నిక కీలక మలుపు తిరుగుతుందని భావించారు&period; ఈ నిధులను ఈనెల 28లోగా జమ చేయాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది&period; ఇదే కాంగ్రెస్ లో ఆందోళనకు కారణమైంది&period; ఇప్పటికే క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్&comma; బీఆర్ఎస్ నువ్వా నేనా అన్నట్లుగా తల పడుతున్నాయి&period; ఈ సమయంలో ఏకంగా 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధుల జమ అంశం కొత్త చర్చకు దారి తీసింది&period; ఎన్నికల్లో కాంగ్రెస్ కు అనుకూల వాతావరణం ఉందనే ప్రచారం వేళ ఈ నిధుల విడుదల ద్వారా ఏం జరుగుతుందనేది కీలకంగా మారింది&period; ఈ తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం రైతు బంధు విషయంలో పునరాలోచన చేసింది&period; ఇచ్చిన అనుమతిని వెనక్కు తీసుకుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..