88
మిచౌంగ్ తుఫాన్ తిరుపతి జిల్లాను అతలాకుతలం చేసింది. తుఫాన్ దెబ్బకు పంటనష్టంతో పాటు రహదారులు కూడా భారీగా దెబ్బతిన్నాయి. తుఫాన్ తాకిడికి దెబ్బతిన్న ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. తుఫాన్‌తో దెబ్బతిన్న పంట పొలాలను, రహదారులను కేంద్ర బృంద సభ్యులు పరిశీలించారు. స్థానిక రైతులు, అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గూడూరులో తుఫాన్ ధాటికి సర్వనాశనమైన పొలాలను శాసనసభ్యులు వరప్రసాద్ కేంద్ర బృందం దృష్టికి తీసుకువచ్చారు. తుఫాన్ ధాటికి అన్నదాతలు భారీ నష్టాన్ని మూటగట్టుకున్నారని, మానవతా దృక్పథంతో కేంద్రానికి నివేదించాలని ఎమ్మెల్యే కోరారు.