నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేటలో చంద్రబాబు పర్యటన…

Advertisements

<p>పేద ప్రజలకు నివాసం కల్పించాలనే లక్ష్యంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తోంది&period; ఈ ఇళ్ల పంపిణీపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు&period; నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట పుదూరులో నిర్వహించిన సభలోపాల్గొన్న చంద్రబాబు ఈ జూన్ నాటికి 2 లక్షల 70 వేల ఇళ్లలో&comma; సెప్టెంబర్ నాటికి లక్షా 60 వేల ఇళ్లలో గృహ ప్రవేశం చేస్తామని తెలిపారు&period; అంతేకాకుండా మరో 12 లక్షల ఇళ్లు కూడా కట్టిస్తామని తెలిపారు&period; ఈ ఇళ్ల అన్నింటికీ పీఎన్‌జీ కనెక్షన్ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు&period; అమరావతే మన రాజధాని అని తీర్మానం చేశామని&comma; త్వరలోనే చట్టం తీసుకొస్తామన్నారు&period;<&sol;p>&NewLine;<p>గోదావరి పుష్కరాల కంటే ముందే&period;&period; పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు&period; ఏపీకి సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉందని&comma; మత్స్యకారులకు ఇది ఉపయోగపడాలని అన్నారు&period; వేట నిషేధం సమయంలో ఇచ్చే ఆర్థికసాయాన్ని 20వేలకు పెంచామన్నారు&period;<br &sol;>&NewLine;ఈ ప్రాంత చేపలను స్థానిక మత్య్సకారులే పట్టుకోవాలని&comma; ఆ విషయంలో ఇతరులు ఎలాంటి నష్టం కలిగించినా సహించమని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు&period; సుపరిపాలన అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు&period; సాంకేతికతతో ఎప్పటికప్పడు అనుసంధానం చేస్తున్నామన్నారు&period; అందరికి పనులు ఆలస్యం కాకుండా వెంటవెంటనే జరిగేందుకు మనమిత్ర&comma; వాట్సప్‌ గవర్నెన్స్‌ తీసుకొచ్చామన్నారు చంద్రబాబు&period; హైదరాబాద్‌&comma; చెన్నై కంటే అమరావతిని నెంబర్‌ వన్‌ స్థానంలో నిలబెడతామని అన్నారు చంద్రబాబు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.