తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వల్లే తనకు గుర్తింపు వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Advertisements

<p>తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి&comma; బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వల్లే తనకు గుర్తింపు వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు&period; కేసీఆర్ లేకపోతే తాను చేసిన మంచి పనులు ప్రజలకు తెలిసేవి కాదని చెప్పారు&period; రావణుడి చెడు వల్లే రాముడి గొప్పతనం తెలిసిందని చెప్పుకొచ్చారు&period; మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ముఖ్యమంత్రి పలు కీలక అంశాలపై మాట్లాడారు&period; కేసీఆర్‌ విశ్రాంతి తీసుకొంటున్నారని అందరూ అంటున్నారని&period;&period; ఆయన్ను గృహ నిర్బంధం చేశారని తనకు అనుమానంగా ఉందన్నారు&period; దేశంలో నియోజకవర్గాల పునర్విభజనపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఏదేదో మాట్లాడుతున్నారని&period;&period; తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెడతామని ఆయన అంటున్నారని మండిపడ్డారు&period; మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్టరా&quest; అంటూ ప్రశ్నించారు&period; నియోజకవర్గాల పునర్విభజనను 50 శాతం సీట్ల ప్రాతిపదికన చేస్తే దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు&period; బీజేపీ ఎంపీ లక్ష్మణ్ దీనిపై వితండవాదం చేస్తున్నారని ఆగ్రహించారు&period; 50 శాతం సీట్లు పెంచుతున్నామని చెప్పినా ఉత్తర భారతదేశానికి నేరుగా లాభం జరుగుతుందని ఆరోపించారు రేవంత్ రెడ్డి&period; రాజకీయంగా అవసరం ఉన్నప్పుడే సౌత్ ఇండియాను పట్టించుకోవడం లేదని&period;&period; ఇక నియోజకవర్గాల పునర్విభజన జరిగితే సౌత్ ఇండియా అవసరం లేకుండా పోతుందని విమర్శించారు&period;<&sol;p>&NewLine;<p>ఇక నేటి నుంచి రెండు రోజుల పాటు తాను కేరళలో ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు రేవంత్ తెలిపారు&period; రాష్ట్ర ప్రజలందరికీ త్వరలో క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తామని భరోసా కల్పించారు రేవంత్ రెడ్డి&period; పంట మార్పిడి విషయంలో రైతులపై ఒత్తిడి తీసుకురామని&period;&period; వారికి అవగాహన కల్పిస్తామని తెలిపారు&period; పేదలకు ఇచ్చే సన్న బియ్యం కోసం రూ&period;14&comma;560 కోట్లు ఖర్చు పెడుతున్నామని&comma; దాంట్లో కోతలు పెట్టమని స్పష్టం చేశారు&period; సన్న బియ్యం పక్కదారి పట్టడం లేదని తెలిపారు&period; మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్న బియ్యంతో అసెంబ్లీలో అందరికీ మంచి భోజనం పెట్టారన్నారు&period; పేదలందరికీ ప్రభుత్వ పథకాలు కచ్చితంగా అందుతాయని పేర్కొన్నారు ముఖ్యమంత్రి&period; వరి వేస్తే ఉరే అని కేసీఆర్ అన్నారని&period;&period; తాము మాత్రం వరి వేస్తే బోనస్ ఇస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.