రాష్ట్రంలో వైసీపీ సినిమాకు ఇంకా వంద రోజులు మాత్రమే మిగిలి ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న చంద్రబాబు గుడుపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. కుప్పం నాకు సొంత కుటుంబం లాంటిదని ఈసారి కుప్పంలో లక్ష ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ప్రకటించిన ‘సూపర్ సిక్స్’ హామీలు అమలు చేసే బాధ్యత నాదేనని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికీ రెండు ఆవులు ఉంటే మంచిదని ఆనాడే చెప్పానని ఆవులు పెంచడం ఏంటని అప్పుడు నన్ను ఎగతాళి చేశారని గుర్తు చేశారు. పాడిని ఒక పరిశ్రమగా చేసి, మీ జీవితాల్లో వెలుగులు తీసుకొస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని అదేవిధంగా నిరుద్యోగులకు నెలకు 3వేల రూపాయలు ఇస్తామని తెలిపారు. యువత ఇంట్లో కూర్చుంటే మార్పు రాదని 100 రోజులు నా కోసం, మీ కోసం పనిచేస్తే మీ జీవితాలు మార్చే బాధ్యత టీడీపీ – జనసేన తీసుకుంటుందని టీడీపీ అధినేత అన్నారు. రాష్ట్రంలో నాలాంటి వాడికే రక్షణ లేకుంటే సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పోలీసులు ముందుకు రావాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
బహిరంగ సభలో చంద్రబాబు
62
previous post