94
చిత్తూరు జిల్లా కుప్పం, నారా చంద్రబాబు నాయుడి కుప్పం పర్యటన పై మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. కుప్పం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. చంద్రబాబు రాక కోసం కుప్పం ప్రజలు ఎదురుచూస్తున్నారు అని, ఈ నెల 28,29,30 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన ఖరారు. నాలుగు మండలాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. నాలుగు మండలాల్లో బహిరంగ సభలు నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు. చంద్రబాబు కుప్పం పర్యటనను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.