68
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని నేసే పేటలో వెలసిన చౌడేశ్వరి దేవి పంచమ జ్యోతుల శోభాయాత్ర శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభించారు. ముందుగా అమ్మవారికి పంచామృతా, కుంకుమార్చనలు చేపట్టి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. పంచమ జ్యోతులను తలపై ఎత్తుకొని పురవీధుల్లో అమ్మవారి పాటలు పాడుతూ శోభాయాత్ర నిర్వహించారు. పంచమ జ్యోతుల శోభాయాత్రను తిలకించుటకు ప్రజలు తండోప తండాలుగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు.