▪️ పవన్ కళ్యాణ్ స్పూర్తితో చేగువేరా బయోపిక్
▪️ డిసెంబర్ 15న 100 థియేటర్లలో విడుదల
▪️ తొలిసారి భారతీయ చిత్ర పరిశ్రమలో చేగువేరా బయోపిక్
క్యూబా పోరాటయోధుడు చేగువేరా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం “చే” – లాంగ్ లైవ్ ట్యాగ్ లైన్. క్యూబా తరువాత ప్రపంచంలోనే తొలిసారి భారతీయ చిత్ర పరిశ్రమలో రూపొందిన చేగువేరా బయోపిక్ ఇది. నవ ఉదయం సమర్పణలో నేచర్ ఆర్ట్స్ బ్యానర్ పై బీఆర్ సభావత్ నాయక్ టైటిల్ రోల్ పోషిస్తూ, దర్శకత్వం వహించారు. సూర్య, బాబు, దేవేంద్ర సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీలో లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్ , పసల ఉమా మహేశ్వర్ కీలకపాత్రలు పోషించారు. రవిశంకర్ సంగీతం అందించారు. సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ సొంతం చేసుకున్న ఈ సినిమా వీరాంజనేయ పిక్చర్స్ సంస్థ ద్వారా 100 కు పైగా థియేటర్ లలో విడుదలకు సిద్ధమైంది. “చే” మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన చేగువేరా కూతురు డాక్టర్ అలైదా గువేరా ఈమూవీ ట్రైలర్, టీజర్‌ను చూసి చిత్రయూనిట్‌ను అభినందించారు..
సినిమా విడుదల సందర్భంగా హీరో, దర్శకుడు బిఆర్ సభావత్ నాయక్ మాట్లాడుతూ.. “పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆరాధించే “విప్లవ వీరుడు , యువత స్పూర్తిదాయకుడు చేగువేరా జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము.. ఆయన చేసిన పోరాటాలను, త్యాగాలను ఈ చిత్రంలో తీశాము. అప్పటి పరిస్థితులకు అద్దం పట్టే విధంగా చాలా జాగ్రత్తలు తీసుకుని, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా ను రూపోందించాం. ఈ మూవీ పోస్టర్‌ను స్వయంగా చేగువేరా కూతురు డా.అలైదా గువేరా విడుదల చేయడం గర్వంగా, సంతోషంగా ఉంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ కు విశేష స్పందన వస్తుండటం చాలా ఆనందం కల్గిస్తుంది” అని అన్నారు. ప్రమోషన్లో భాగంగా కాలేజ్ లకు వెళ్లినప్పుడు యువతను నుంచి మంచి స్పందన వస్తుండటం చూసి సినిమాపై మరింత నమ్మకం పెరిగిందన్నారు. వీరాంజనేయ పిక్చర్స్ సంస్థ ద్వారా 100కు పైగా థియేటర్ లలో డిసెంబర్ 15 న రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు..
నటీనటులు: లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్, పసల ఉమామహేశ్వర్, బి.ఆర్ సభావత్ నాయక్..
నిర్మాతలు: సూర్య , బాబు, దేవేంద్ర
కో డైరెక్టర్: నాని బాబు
రచయిత, దర్శకుడు: బి.ఆర్ సభావత్ నాయక్
బ్యానర్: నేచర్ ఆర్ట్స్
పబ్లిసిటి డిజైనర్: వివరెడ్డి పోస్టర్స్
డీవోపీ: కళ్యాణ్ సమి, జగదీష్
ఎడిటర్: శివ శర్వాణి
సంగీత దర్శకుడు : రవిశంకర్
పీఆర్ఓ: దయ్యాల అశోక్