93
అల్సర్ లతో బాధపడేవారికి అరటి పండ్లను తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. డయాబెటిస్ రాకుండా, బీపి కంట్రోల్ లో ఉండేలా చేయగలిగిన శక్తి అరటిపండులో ఉందని చెబుతున్నారు. అధిక ఫైబర్, ప్రోటీన్లు ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల డయాబెటిస్ కు చెక్ పెట్టొచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఇక డయాబెటిస్ బాధితులు కూడా అరటి పండ్లను తినొచ్చు అని అయితే బాగా మిగల పండిన అరటి పండ్లను తినకూడదు అని చెబుతున్నారు. అరటి పండ్లను తినడం వల్ల క్యాన్సర్ రిస్క్ నుండి కూడా కాపాడుకోవచ్చని, చర్మ సంబంధమైన సమస్యల నుండి కూడా బయట పడవచ్చని చెబుతున్నారు. శరీరానికి అరటిపండు నిగారింపును ఇస్తుంది అని, జుట్టు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది అని చెబుతున్నారు.