80
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలో చిరుత కలకలం రేపుతుంది. గుంపన్ పళ్లి గ్రామంలో రమ అనే మహిళపై చిరుత పులి దాడి చేసింది. అయితే చిరుత పులిదాడిలో రమ చకచక్యంగా తప్పించుకోని ప్రాణలతో బయటపడింది. చిరుత దాడి గాయపాడిన రమను అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు గ్రామస్తులు. వ్యవసాయ పొలంలో ఎద్దులకు త్రాగు నీరు పెడుతుండగా చిరుత వక్కసారిగా దాడి చేసినట్లు రమ తెలిపారు. డాక్య అనే రైతు గొర్లు, మేకలను చంపి తిన్నట్లు రమ తెలిపింది. అయితే ఇదే విషయం గురించి అటవీ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేసినా, పట్టించు కోవడం లేదనీ గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అడవికి సమీపంలో ఉండే గ్రామాలలో చిరుత పులి సంచారంతో గుంపన్ పళ్లి గ్రామస్తులు భయాందోళన గురవుతున్నారు.