96
పల్నాడు జిల్లాలో వలస కూలీల పిల్లలు డయేరియా బారిన పడ్డారు. అచ్చంపేట మండలం పెదపాలెం గ్రామానికి 50 మంది కూలీల కుటుంబాలు వలస వచ్చాయి. కర్ణాటక రాష్ర్టం నుంచి మిర్చి కోతల నిమిత్తం వారంతా అక్కడకు వచ్చారు. కలుషితమైన నీరు తాగడంతో ఆరుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వారంతా సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఆ చిన్నారుల పరిస్థతి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.