90
శ్రీకాకుళం జిల్లా ఆర్థికంగా వెనకబడినప్పటికీ ఆధ్యాత్మికంగా చాలా ముందున్న జిల్లా అని చినజీయర్ స్వామి అన్నారు. నగరంలోని డిసిసిబి కాలనీలో గల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1988లో వేదాన్ని చదువుతూ శ్రీకూర్మం నుండి అనేక గ్రామాలను సందర్శిస్తూ పూరి వరకు పాదయాత్ర చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలందరూ ఏ అరిష్టాలు లేకుండా సంతోషంగా ఉండాలనే సంకల్పంతో పాదయాత్ర చేశామన్నారు. భక్తులందరి ముఖాలు చూస్తుంటే అధిక సంఖ్యలో వికసించిన తామర పుష్పాల వలె అందంగా ఉన్నాయన్నారు. జిల్లా ప్రజల ఉత్సాహాన్ని చూస్తే తనకు చాలా ఆనందంగా ఉంటుందని చినజీయర్ స్వామి పేర్కొన్నారు.