ఏపీ సీఎం చంద్రబాబుతో ప్రపంచ బ్యాంక్ బృందం భేటీ

Advertisements

<p>ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం అమరావతి రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమైంది&period; ఈ సందర్భంగా అమరావతి నిర్మాణ ప్రగతిని ప్రతినిధి బృందం ప్రశంసించింది&period; నగరంలో అభివృద్ధి చేస్తున్న మౌలిక సదుపాయాలు&comma; ఐటీ&comma; విద్యుత్ రంగాల్లో చేపట్టిన సంస్కరణల వల్ల అమరావతి భారీగా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే అవకాశముందని వారు అభిప్రాయపడ్డారు&period; రాష్ట్రానికి అమరావతి ఒక ప్రధాన గ్రోత్ ఇంజిన్‌గా మారుతుందని తెలిపారు&period; మౌలిక సదుపాయాల విస్తరణతో వాణిజ్య కార్యకలాపాలకు అమరావతి కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు&period; ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణంతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు&period; రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విభజించి సమతుల్య అభివృద్ధి సాధించేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు ఆయన వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.